ఇసుక ర్యాంపుల కోసం ఘర్షణ
భద్రాచలం ఐటీడీఏ ముందు సొసైటీ సభ్యుల ఆందోళన
భద్రాచలం, నవంబర్ 3, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రా చలం నియోజకవర్గంలోని చర్ల మండలం లో ఇసుక ర్యాంపులపై సొసైటీ సభ్యులు రైజింగ్ కాంట్రాక్టర్ల మధ్య ఘర్షణ తలెత్తింది. చీమలపాడు ఇసుక రైజింగ్ కాంట్రాక్టర్లు సొసైటీ సభ్యులకు అన్యాయం చేస్తున్నారంటూ బాధిత సొసైటీ సభ్యులు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు సోమవారం ఆందోళన చేపట్టారు.సొసైటీ బై లాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సభ్యులను తొలగిం చకుండా, మాజీ జడ్పీటీసీ మరియు కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నారని వా రు ఆరోపించారు.
చర్ల మండలంలో ఇసుక మాఫియా బలపడేందుకు కొంతమంది అధికారుల ప్రోత్సాహమే కారణమని ఆందోళనకారులు మండిపడ్డారు.సొసైటీ అసలు సభ్యులను తొలగించి, సంబంధం లేని వ్యక్తులను సొసైటీ కమిటీలో చేర్చారని వారు తెలిపారు. ఈ వ్యవహారంలో చర్ల మండలంలోని ప్రజాప్రతినిధులు, రైజింగ్ కాంట్రాక్టర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈఆందోళనకు సిపిఐ (ఎం ఎల్) మాస్ లైన్ పార్టీ మద్దతు తెలిపింది. అనంతరం సొసైటీ సభ్యులు భ ద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్కు వినతిపత్రం అందజేసి, తమకు న్యాయం చేయాల ని, చట్టబద్ధమైన ర్యాంపులను మళ్లీ తమ ఆధీనంలోకి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






