04-11-2025 12:28:49 AM
-కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
-బీఆర్‌ఎస్ భారీ ర్యాలీలో మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ గెస్తుందని, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి చామకూర మల్లా రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి మల్లా రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చి, బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మల్లా రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజ లు బీఆర్‌ఎస్ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా మళ్లీ కేసీఆర్ రావాలి, సునీతమ్మ గెలవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. దివంగత నేత గోపన్న ఆత్మ శాంతించాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల మూడు నెలల పాలనలో ప్రజలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన విమర్శించా రు.
ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్‌లో తమను గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బెదిరిస్తున్నారని, ఇలాంటి బ్లాక్‌మె యిల్ రాజకీయాలకు ప్రజలు భయపడరని మల్లారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలంతా ఏకమై ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు.
ఇంటింటా పర్యటన
ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. ఒకవైపు ఇంటింటి ప్రచారంతో ప్రజల మన్ననలు పొందుతూనే, మరోవైపు భారీ ర్యాలీ లతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతున్నారు. రహమత్ నగర్ డివిజన్ పరిధి లోని శ్రీరామ్ నగర్ కాలనీలో సోమవారం సునీత గోపీనాథ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరం జన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, బీఆర్‌ఎస్ ప్రభు త్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వెంగళ్ రావు నగర్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహిళలు భారీర్యాలీ నిర్వహించారు. స్థానిక కృష్ణ కాంత్ పార్క్ నుంచి యూసఫ్‌గూడ చౌరస్తా మీదుగా మధురానగర్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. సెటిల్మెంట్లు చేసే పార్టీలు కాదు, అభివృద్ధి చేసే బీఆర్‌ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటు న్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ ర్యాలీ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, కార్పొరేటర్ దేదీప్య పాల్గొన్నారు.