24-10-2025 06:25:30 PM
ఈనెల 30వ తేదీ నుంచి ఫీజు చెల్లింపులు: డీఈవో నాగలక్ష్మి
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశానుసారం పదవ తరగతి పరీక్ష ఫీజు తేదీ ఖరారు అయినట్లు జిల్లా విద్యాధికారి నాగలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీ నుంచి నవంబర్ 13వ తేది వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 29 వరకు రూ 200 అపరాధ రుసుముతో డిసెంబర్ 2 నుంచి 11వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 15 నుంచి 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జిల్లాలోని పదవ తరగతి వ్రాసే విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలన్నారు.