24-10-2025 06:30:06 PM
తాండూరు,(విజయక్రాంతి): ముదిరాజుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పశు సంవర్ధక, మత్స్య, క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో రూ.,50 లక్షల వ్యయంతో నిర్మాణం చేస్తున్న ముదిరాజ్ భవన పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.