calender_icon.png 24 October, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేగంపేట్ శివారులో అనుమతి లేని బోరు సీజ్

24-10-2025 06:21:25 PM

రామగిరి,(విజయక్రాంతి): మండలంలోని బేగంపేట్ శివారులో అనుమతి లేని వ్యవసాయ బోరు మోటర్ ను శుక్రవారం రామగిరి తాసిల్దార్ సుమన్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ సీజ్ చేసినట్లు తెలిపారు. మండలంలోని ఆదివార పేటకు చెందిన ఏలువాక శంకరయ్య అనుమతి లేకుండా వ్యవసాయ బోరు వేసి మోటార్ బిగించడంతో బాధితుడు వెంకటేష్ చేసిన ఫిర్యాదు మేరకు జల భూగర్భ, రెవెన్యూ శాఖ  అధికారులు విచారణ చేపట్టారు. ఇరు శాఖల అధికారులు సంయుక్త  విచారణలో అనుమతి లేకుండా బోరు వేశారని తేలడంతో అట్టి వ్యవసాయ బోరును సీజేసినట్లు అధికారులు తెలిపారు. బోర్ మోటార్ సీజ్ నిబంధనల ను ఉల్లంఘిస్తే  చట్టపరంగా చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.