31-07-2025 01:11:17 AM
- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- అప్రెంటీసీలకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): స్వచ్ఛ తులిప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా జీహెచ్‌ఎంసీ యువతను పట్టణ పారిశుధ్యంలో చురుకుగా పాల్గొనేలా చేస్తుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన అప్రెంటిసీలకు సర్టిఫికేట్లను మేయర్ విజయలక్ష్మి అందించి అభినందించారు.
ఎఐసీటీఈ పోర్టల్ ద్వారా 8 మంది అప్రెం టీసీలను ఎంపిక చేసి జీహెచ్‌ఎంసీ ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య వ్యవస్థలలో నిర్మాణాత్మక శిక్షణ అందించామని చెప్పా రు. ఫతుల్లగూడ వేస్ట్ ప్లాంట్, జవహర్‌నగర్ ఫెసిలిటీకి క్షేత్ర సందర్శనల ద్వారా వారు ఆచరణాత్మక అనుభవాన్ని పొందారన్నారు. వ్యర్థాల నిర్వహణ పద్ధతులను మెరుగుపరచడానికి కార్యాచరణ సిఫార్సులతో కూడిన ప్రాజెక్ట్ నివేదికను ఇంటర్న్‌లు సమర్పించారని మేయర్ తెలిపారు.