06-08-2025 08:49:46 PM
తిమ్మాపూర్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ ఉపాధి కల్పన రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమం విజయవంతమైంది. ఈ ధర్నాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వారీగా బీసీ నాయకులు భారీగా ఢిల్లీకి తరలివచ్చారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Dr. Kavvampally Satyanarayana) ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గం నుంచి బీసీ నాయకులు హాజరయ్యారు. కోమటిరెడ్డి పద్మారెడ్డితో పాటు పోతుగంటి శ్రీనివాస్, తమ్మనవేణి రాముల యాదవ్, కానిగంటి మల్లికార్జున్, బుర్ర తిరుపతి గౌడ్, వాసాల తిరుపతి, గోపి తదితరులు పాల్గొన్నారు.