calender_icon.png 6 August, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులు పిట్టల్లా రాలుతున్న పట్టింపు లేదా

06-08-2025 08:37:46 PM

ప్రమాదల నివారణకు సి ఎండీ జోక్యం చేసుకోవాలి..

జిఎం కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలోని ముందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న పర్మనెంట్, కాంట్రాక్టు కార్మికులు విది నిర్వహణలో అనేక ప్రమాదాలు జరిగి మరణించడం, గాయలపాలవుతున్నప్పటికీ సింగరేణి(Singareni) యజమాన్యం రక్షణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి సింగరేణి తీరుపై మండిపడ్డారు. సింగరేణిలో రక్షణ చర్యలు చేపట్టాలని కార్మికుల పని స్థలాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం జిఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గని ప్రమాదాలలో కార్మికుల మృతితో ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నప్పటికీ కార్మికుల ప్రాణాలను కాపాడడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బొగ్గు ఉత్పత్తి, లాభాలపై చూపిన శ్రద్ధ కార్మికుల ప్రాణాలను కాపాడటంలో, రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడంలో చూపడం లేదని, రక్షణ సూత్రాలను యాజ మాన్యం పాటించడం లేదని ఆరోపించారు. పని ప్రదేశాల్లో కార్మికుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని, కాల పరిమితి ముగిసి చెడిపోయిన యంత్రాలతో పని చేపిస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గని ప్రమాదాలు, కారణాలు,రక్షణ వ్యవస్థ పని తీరుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, జాగ్రత్తల కోసం తక్షణమే అన్ని పర్మనెంట్, కాంట్రాక్టు యూనియన్లతో, నిపుణులతో,సీనియర్ కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలకు బాధ్యులుగా స్థానిక అధికారి,సేఫ్టి అధికారి, ఏరియా జనరల్ మేనేజర్లపై చర్యలు తీసుకోవాలనీ, డీజీఎంఎస్ తో జరిగే త్రిసభ్య కమిటి సమావేశంలో అన్ని కార్మిక సంఘాలను, కాంట్రాక్టు కార్మిక సంఘాలను పిలవాలనీ, ప్రతి షిఫ్ట్ లో సెప్టి అధికారులను నియమించి, పని ప్రదేశాల్లో పటిష్ఠమైన రక్షణ చర్యలు తీసుకోవాలనీ, ప్రతి విభాగం వద్ద ప్రాథమిక వైద్యంతో పాటు,అంబులెన్స్ లు, స్త్రేచ్చర్లు,ఆక్సిజన్,ఫస్ట్ యిజ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, బెల్లంపల్లి, రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రిలల్లో అన్ని రకాల వైద్య నిపుణులతో పాటు, తగినంత సిబ్బందిని నియమించాలనీ, ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ తో పాటు డాక్టర్లను ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపించాలనీ, కార్మికుల రక్షణ  సంక్షేమానికి నిధులను పెంచాలని డిమాండ్ చేశారు.

అనంతరం పరు డిమాండ్లతో వినతి పత్రాన్ని ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ కు  అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమాస ప్రకాష్, బోడెంకి చందు, జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్, గోమాస అశోక్, సామల ఉమారాణి, నాయకులు దాగం శ్రీకాంత్, మహేందర్, సిడాం సమ్మక్క, బి రమాదేవి, నిర్మల, సిడాం జంగుబాయి, కె రాజేశం, రాజలింగు, పోశం లు పాల్గొన్నారు.