06-08-2025 08:40:31 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మలి విడత తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం బెల్లంపల్లి తహసిల్దార్ కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి అధికారులు సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిటి హమీద్, ఆర్ ఐ రమేష్ బాబు, మురళీధర్, రెవెన్యూ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.