06-08-2025 08:45:46 PM
లయన్స్ క్లబ్ ఆఫ్ మునుగోడు – తొలి స్థాపనోత్సవం..
మునుగోడు (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ మునుగోడు(Lions Club Munugode) నూతన అధ్యక్షునిగా నారా బోయిన రవి ముదిరాజును లయన్స్ క్లబ్ ప్రముఖ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. కార్యదర్శిగా లయన్ పాలకూరి నర్సింహా, కోశాధికారిగా మిర్యాల వెంకటేశంను ఎన్నుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ మునుగోడు యొక్క ఇనాగురేషన్, ఇన్స్టాలేషన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం సాయంత్రం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ చేశారు.
ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ యొక్క ప్రముఖ నాయకులు, అతిథులు, సభ్యులు, వారి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులతో పెద్దఎత్తున హాజరయ్యారు. మునుగోడు క్లబ్ నూతన అధ్యక్షులు లయన్ నారబోయిన రవి ముదిరాజ్ మాట్లాడుతూ... ప్రపంచంలో అతిపెద్ద సేవా సంస్థలలో ఒకటైన లయన్స్ క్లబ్ ఇప్పుడు మునుగోడులో అడుగుపెట్టిందని అన్నారు. ఇది నూతన క్లబ్ అయినప్పటికీ సేవా పట్ల మా నిబద్ధత ఎంతో ప్రగాఢమైనది.
మేము సామాజిక సేవలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం, ఈ క్లబ్‌ను ప్రారంభించడంలో భాగంగా ఉన్న లయన్ కె.వి ప్రసాద్, లయన్ శ్రీనివాస్ ఎర్రమాదల మద్దతు ప్రశంసనీయమైనదని, వారి స్ఫూర్తితో మేము ఈ సంవత్సరం మా క్లబ్ తరఫున ఒక ఎం జె ఎఫ్ (Melvin Jones Fellow) ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అని తెలిపారు.ఈ కార్యక్రమం లో డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ మదన్ మోహన్ రేపాలా, లయన్ గోలి అమరేందర్ రెడ్డి, లయన్ కె వీ ప్రసాద్, లయన్ శ్రీనివాస్ ఎర్రమాద, మోహన్ రావు, అనంత లింగస్వామి,పొలగొని సైదులు ఉన్నారు.