16-08-2024 12:36:15 AM
ఎల్బీనగర్, ఆగస్టు 15: ఎల్బీనగర్‌లోని అనాథ విద్యార్థి గృహం విద్యార్థులకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సుమారు రూ.6 లక్షల విలువైన దుస్తులు, షూస్, ఇతర సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో అనాథ విద్యార్థి గృహం నిర్వాహకుడు మార్గం రాజేశ్, ఐసీఐసీఐ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నోట్‌బుక్స్ పంపిణీ..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అనాథాశ్రమాల్లో ఉంటున్న విద్యార్థులకు నోట్‌బుక్స్ సమకూర్చారు. సీపీ ఆదేశాలతో అమ్మఒడి అనాథాశ్రమంలో 45 మంది చిన్నారులకు, ఎమ్మాన్యుయేల్ అనాథాశ్రమంలో 10 మంది చిన్నారులకు నోట్‌బుక్స్‌తోపాటు స్వీట్‌బాక్స్‌లను స్టోర్స్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ అందజేశారు.