18-11-2025 05:30:20 PM
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్..
రాజీవ్ నగర్ బస్తీ దవాఖాన, అంబేద్కర్ నగర్ యూపీహెచ్ సీల్లో ఆకస్మిక తనిఖీ..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ బస్తీ దవాఖాన, అంబేద్కర్ నగర్ యూపీహెచ్ సీల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ గది, ఇన్ పేషెంట్ గదులు,ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు. వైద్య సేవలకు వచ్చిన రోగులతో మాట్లాడారు. ఏఏ పరీక్షలు చేశారు? వైద్యం పై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇక్కడ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.