calender_icon.png 18 November, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి

16-08-2024 12:34:29 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 15: ఆర్టీసీ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సంస్థ అభివృద్ధికి దోహదపడాలని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపోను గురువారం ఆయన సందర్శించి ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు, డిపో గ్యారేజీని పరిశీలించారు. ప్రతి ఉద్యోగి ఓఆర్, ఈపీకే, కేఎంపీఎల్‌లను అధికంగా తీసుకురావాలని చెప్పారు. ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచడం ద్వారా సంస్థ  పురోగతి చెందుతుందని, అప్పుడే ఉద్యోగులకు అన్ని రకాల ఆర్థిక సదుపాయాలు కలుగుతాయని చెప్పారు.

మెరుగైన రవాణా సేవలందిస్తున్న ఆర్టీసీని ప్రజలు ఆదరించేలా అనేక స్కీమ్‌లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. శ్రావణ మాసంలో తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల నిమిత్తం, వివాహాది శుభకార్యాల కోసం 10 శాతం రాయితీతో పాటు అడ్వాన్స్ డిపాజిట్ లేకుండా ఆర్టీసీ అద్దె బస్సులను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకొని సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ (మెకానిక్) సాయి సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.