18-11-2025 05:36:05 PM
నర్సయ్య కుటుంబానికి 50 కేజీల రైస్..
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ వాకర్స్ సామాజిక సేవలో ముందుకెళ్తుంది. అందులో భాగంగా మంగళవారం తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ఇంక్లైన్బస్తీ నివాసి నరసయ్య కుటుంబాన్నీ పరామర్శించి, 56కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ నెల 9న నర్సయ్య మృతిచెందాడు. ఈ విషయం తెలిసిన తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వారి ఇంటికి వెళ్లి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరుపేదలైన నరసయ్య కుటుంబానికి 50 కేజీ ల బియ్యం తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రత్నం రాజన్న, రంగ రామన్న, కంటెవాడ నాగేష్ కుమార్, రత్నం ఐలయ్య, కజ్జం రమేష్, కోయాడ శంకర్ గౌడ్, భీమిని కనకయ్య గౌడ్, తిప్ప రాజయ్య, గైని మల్లేష్, బింగి పోశం, నరసయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.