18-11-2025 05:32:56 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
కేడీసీలో సర్దార్.150 యూనిటీ మార్చ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
హనుమకొండ (విజయక్రాంతి): ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికీ ఐక్యతతో ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కేంద్ర యువజన సర్వీసులు క్రీడ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సంస్థల ఆధ్వర్యంలో సర్దార్.150 ఐక్యత పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పూలమాల వేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహబరీష్ మాట్లాడుతూ భారత దేశంలో స్వేచ్ఛ కోసం తపించేవారని, ఎన్ని భాషలు మాట్లాడిన ఎన్ని ప్రాంతాలు ఉన్న మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. భారత దేశ ప్రజల్ని చైతన్యపరిచి ఏకతాటిపై నడిపించిన మహనీయుడని కొనియాడారు. ప్రజలు ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలన్నారు.అలాగే డ్రగ్స్ రహిత భారత దేశంగా తీర్చిదిద్దడానికి భారత ప్రభుత్వం చేపట్టిన నషా ముక్తి భారత్ అభియాన్ ప్రతిజ్ఞను యువతకు చేయించారు అనంతరం కలెక్టర్ జెండా ఊపి పాద యాత్రను ప్రారంభించడం జరిగింది.ఈ యొక్క యాత్ర కేడీసీ కాలేజ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై పోలీస్ హేడ్ కోటర్స్ మీదుగా అంబేద్కర్ అంబేద్కర్ సర్కిల్ నుండి తిరిగి కేడిసి కాలేజ్ గ్రౌండ్స్ లో ముగింపు కావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, సూపరిండెంట్ బానోతు దేవిలాల్, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గుర్రం శ్రీనివాస్,కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి, ప్రభుత్వం చే నామినేట్ చేయబడ్డ మెంబర్స్ జయంత్ లాల్, సాంద్ర మధు, తీగల భరత్, మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ, కార్పొరేటర్లు గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, రావుల కోమల కిషన్, దాస్యం అభినవ్ భాస్కర్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మార్తనేని ధర్మారావు, మాజీ మేయర్ టి. రాజేశ్వరరావు, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్, బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, నాను నాయక్, శేషగిరిరావు, యువజన నాయకుడు ఎర్రగొల్ల భరత్ వీర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్సిసి ప్రోగ్రాం ఆఫీసర్ సవ్వాసి శ్రీనివాసు, ప్రవీణ్,మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సిసి నుండి 10 టి, 4 ఎయిర్, 1 సి టి ఆర్, 8టి బెటాలియన్స్ అలాగే మెప్మా మహిళా సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సుమారు 2000 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.