calender_icon.png 18 November, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీలకు దొరికిన విద్యుత్ ఏఈ

18-11-2025 05:42:03 PM

లంచం ఇస్తేనే పని స్పీడ్..

ట్రాన్స్ఫార్మర్ కు 40,వేలు మూల్యం చెల్లాల్సిందే..

అడ్వాన్సుగా 20,వేలు వసూలు..

ఏసీబీని ఆశ్రయించిన రైతు..

గోపాలపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ రంగానికి ఉన్నంత డిమాండ్ ఏ రంగంలో కూడా లేదు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో కన్నా విద్యుత్ శాఖకే జీతభత్యాలను ప్రభుత్వం పెద్ద మొత్తంలో చెల్లిస్తుంది. అయినా విద్యుత్ అధికారులు చాలాదంటూ కక్కుర్తి పడి అడ్డంగా దొరికిపోతున్నా సంఘటన వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లో మంగళవారం ఏసీబీలకు అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. విద్యుత్ రంగంలో వనపర్తి జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రెడ్డిహర్షవర్ధన్ రెడ్డి విద్యుత్ ఏఈగా మొదటి పోస్టింగ్ గోపాలపేటలోనే విధులు నిర్వహించేందుకు బాధ్యతలను చేపట్టారు.

ఏయే బాధ్యతలు చేపట్టి రెండేళ్లు గడవకముందే ఏసీబీలకు అడ్డంగా దొరికిపోవడం గోపాలపేట ప్రజలకు ఆశ్చర్యం వేసింది. ఇదిలా ఉండగా రైతుల కష్టాలు విద్యుత్ అధికారులకు తెలియక లంచాలకు ప్రకృతి పడుతున్నారు. వనపర్తి జిల్లా ఇటీవలే మండలంగా మారినా ఏదుల మండలంలో ఓ రైతు ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉండి విద్యుత్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి తరచు ఆ రైతును తన చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఇలా నీవు నా చుట్టూ ప్రదర్శనలు చేస్తే పని కాదని మూల్యం చెల్లిస్తే తప్ప ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయిస్తానని ఆ రైతుకు హితువు పలికాడు. దీంతో ఏదులకు చెందిన రైతు మనసిరిగి వెనిదిరిగాడు.

ఎలాగైనా ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలని ఆ రైతు తెలిసిన వారితో అప్పులు చేశాడు. మళ్లీ కొన్ని రోజుల ముందు ఆ రైతు విద్యుత్ ఏఈ హర్షవర్ధన్ రెడ్డికి మళ్లీ కొన్ని రోజుల ముందు ఆ రైతు విద్యుత్ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి దగ్గరికి వచ్చాడు. సార్ నా ట్రాన్స్ఫార్మర్ పని ఎంతవరకు వచ్చిందని అడిగాడు. ముసుగులో గుద్దులాట ఎందుకని ఏఈ హర్షవర్ధన్ రెడ్డి 40 వేలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయిస్తానని గట్టిగా ఆదేశించాడు. ఆలోచన చేశాడు. ఇంట్లో ఉన్న వస్తువులు మారి కొంత అప్పు చేసి ఏఈ హర్షవర్ధన్ రెడ్డికి మొదటి విడతగా 20వేలను ముట్ట  చెప్పాడు. రెండో విడత గడువు అడిగి ఆ రైతు డబ్బులు ఎక్కడ దొరకక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

గోపాల్పేట ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ట్రాన్స్ఫార్మర్ కోసం 40 వేలు లంచం అడిగాడని మొదటి విడతగా 20వేలు ఇచ్చానని ఏసీబీ అధికారులకు తెలిపాడు. ఏసీబీ అధికారులు వివరాలను సేకరించి వారి వద్ద ఉన్న మరో 20 వేల రూపాయలను ఆ రైతుకు అందజేసి మేము చెప్పిన టైం కు ఇవ్వాలని రైతుతో తెలిపినట్లు తెలిసింది. ఆ రైతు ఏఈ హర్షవర్ధన్ రెడ్డికి 20 వేలు ముట్ట చెపుతుండగా ఏసీబీ అధికారులు రైట్ చేసి పట్టుకున్నారు. గోపాలపేట ఏఈ హర్షవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తూన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.