18-11-2025 05:38:42 PM
గజ్వేల్: గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ గ్రామానికి చెందిన మల్లేశం(25) అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతిచెందాడు. మృతునికి భార్య, ఆరు నెలల బాబు, తల్లి ఉన్నారు. విషయం తెలుసుకున్న పల్లెపహాడ్ యువతరం యూత్ నాయకులు మల్లేశం కుటుంబాన్ని పరామర్శించి బియ్యం, నిత్యవసర సరుకులు వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా యువతరం యూత్ అధ్యక్షులు కొమ్ము నరేష్ యాదవ్ మాట్లాడుతూ మల్లేశం మృతి కుటుంబానికి తీరని లోటని ఇంత చిన్న వయసులో అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువతరం యూత్ నాయకులు నర్సింలు, శేఖర్, స్వామి, శేఖర్, రాజయ్య, బాబు, దుర్గయ్య, బిక్షపతి, అనిల్, శ్రీకాంత్, ఆంజనేయులు, యాదగిరి, స్వామి, మధు తదితరులు పాల్గొన్నారు.