calender_icon.png 17 September, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా బడ్జెట్: ప్రధాని మోడీ

22-07-2024 11:46:44 AM

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ మొదటి వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని ఆకాంక్షించారు. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా బడ్జెట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని మోడీ తెలిపారు.