07-01-2026 07:35:48 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు ముందుకు వేసినట్లు గ్రామ సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్ తెలిపారు. జై సేవాలాల్ భూక్యా రెడ్డి తండాలోని హనుమాన్ తండా వెళ్లే దారి బురదమయం కావడంతో సర్పంచ్ నరేష్ నాయక్ తన సొంత నిధులతో సుమారు 60 ట్రాక్టర్ల మట్టిని జేసీబీ సహాయంతో పోయించడం జరిగిందని తెలిపారు.
దీనివల్ల తండా ప్రజలకు రాకపోకలు సులభమవడంతో పాటు, గ్రామ అభివృద్ధికి మరింత ఊతం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తామని సర్పంచ్ నరేష్ నాయక్ అన్నారు.గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, ప్రజలందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.