calender_icon.png 24 May, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్ఫలితాలిస్తున్న సీఎం ఢిల్లీ పర్యటనలు

24-05-2025 01:40:00 AM

కేంద్రం నుంచి ఒక్కొక్కటిగా సాధిస్తున్న రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ఢిల్లీ పర్యటనలు ఫలితాలనిస్తున్నాయి. కంటోన్మెంట్ భూముల మొదలు ఒక్కొక్కటిగా కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన అంశాలపై రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులు, సంప్రదింపులు సాకారమవుతున్నాయి.

రాష్ర్ట విభజన అనంతరం కేటాయించిన ఐపీఎస్ అధికారులు రాష్ర్ట అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు విజ్ఞప్తిచేశారు. దీంతో తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను కేంద్రం 139 నుంచి 151కి పెంచింది. అదనంగా 29 మం ది ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని ప్రధా ని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్‌రెడి పలుమార్లు లేఖలు రాశా రు.

దేశంలోనే ప్రధాన అయిదు నగరాల్లో హైదరాబాద్ ఉండటం, నానాటికీ పెరుగుతున్న డ్రగ్స్, సైబర్ నేరాలు, పట్టణీకరణ నేపథ్యంలో ఐపీఎస్ అధికారుల సేవలు అవసరమని కేంద్రానికి వివరించారు. సీఎం రే వంత్‌రెడ్డి విజ్ఞప్తితోపాటు ప్రభుత్వం సమర్పించిన పూర్తి వివరాలతో సంతృప్తి చెందిన కేంద్రం, తెలంగాణకు అదనంగా 12 ఐపీఎస్ క్యాడర్ పోస్టులు పెంచింది.

హైదరాబాద్‌కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణకు కేంద్రం 2 వేల ఎలక్ట్రిక్ బ స్సులను కేటాయించింది. వచ్చే ఏడాది మా ర్చి నాటికి హైదరాబాద్‌లో ఈ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. నగరంలో కాలుష్యానికి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎలక్ట్రిక్ వాహనాలు కేటాయించాలని కేంద్రాన్ని పలుమా ర్లు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు.

ఈ ఏడాది జనవరి 16న ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెడీ కుమారస్వామి, ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో సమావేశమయ్యారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్ నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని రేవంత్‌రెడ్డి కోరారు.

ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఎలక్ట్రిక్ బస్సులతో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలని, ఇందుకోసమే డీజిల్ బస్సులను రిట్రోఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.