24-05-2025 06:10:25 PM
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య..
మహబూబాబాద్ (విజయక్రాంతి): సంక్షేమ, అభివృద్ధి పథకాలను పటిష్టంగా అమలు చేస్తూ, ప్రతి పేద ఇంటికి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) తెలిపారు. శనివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గంధంపల్లి ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ప్రతి పల్లెలో ప్రగతి, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలం అందించడమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ నిర్విరామంగా శ్రమిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి భూక్య ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.