calender_icon.png 5 August, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి

05-08-2025 12:35:54 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, ఆగస్టు 4 :  నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి వరప్రదాయనిగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన కుమ్మరి బస్వరాజు  గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.

మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2.50 లక్షల ఎల్‌ఓసిని సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, వెంకట్ రెడ్డి, దశరథ రెడ్డి, పాండు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.