calender_icon.png 5 August, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్విరామ సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు

05-08-2025 12:35:34 AM

-జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం, ఆగస్టు 4 (విజయ క్రాంతి): ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించిన అధికారులు, సిబ్బందికు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూలై నెలలో పదవి విరమణ పొందిన 13 మంది అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

డిపిఆర్‌ఓ కార్యాలయ డ్రైవర్ బి. నరసయ్య, ఇంటర్మీడియట్ విద్యా విభాగానికి సంబంధించి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస రావు, ప్రిన్సిపాల్, ఏ. వెంకటేశ్వర్లు, లైబ్రేరియన్ సత్యనారాయణ, హిస్టరీ జూనియర్ లెక్చరర్ పి.వి. నాగేందర్ రావు, హార్టికల్చర్, సెరీకల్చర్ విభాగం సూపరింటెండెంట్ ఎస్. విజయ కుమార్, వైద్యారోగ్య శాఖ సి.హెచ్.ఓ. డాక్టర్ కే సుధారాణి, ఎంపి హెచ్‌ఎస్ విజయ్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అసిస్టెంట్ ఎన్. ఎల్లస్వామి, గిరిజన సంక్షేమ శాఖ లో సహాయ గిరిజన అభివృద్ధి అధికారి జహీరుద్దీన్, పంచాయతీరాజ్ శాఖ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కొణిజెర్ల తహసిల్దార్ కార్యాలయ సబార్డినేట్ రామచందర్, డి.ఆర్.డి.ఓ. లోని ఏ.పి.ఓ పద్మ పదవీ విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.