ఆపదలో అండగా సీఎం రిలీఫ్ ఫండ్
02-07-2026 01:32 AM
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో బాబురావుకు రూ.60 వేల ఆర్థిక సాయం
నాగోల్, జూలై 1 (విజయక్రాంతి): చైతన్యపురి డివిజన్ పరిధిలోని ద్వారకాపురం నివాసి బాబురావు వైద్య చికిత్సకు అయిన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) నుంచి రూ.60 వేల ఆర్థిక సాయం మంజూరైంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన చెక్కును బీఆర్‌ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ద్వారా లబ్ధిదారునికి అందజేశారు.






