calender_icon.png 23 January, 2026 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

23-01-2026 12:00:00 AM

మహబూబాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ఒక వరం అని కొత్తగూడ సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గాంధీనగర్ గ్రామానికి చెందిన మహ్మద్ యాకుబ్ కు 18,500 రూపాయల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందచేశారు.

ఈ సందర్బంగా సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బోడ ఈర్య, వేణు, వజ్జ బాలరాజు, ఈర్య నాయక్, అఫ్జల్, యాదగిరి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.