23-01-2026 12:00:00 AM
కేసముద్రం, జనవరి 22 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణంలోని అమీనా పురంకు చెందిన బండి బాలరాజు ఇటీవల మృతి చెందడంతో, ఆయనతో కలిసి చదువుకున్న 199394 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు 38,600 రూపాయలను బాలరాజు కూతుళ్లు అనూష, శివాని, భార్య మంజులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థుల సంఘం ప్రచార కార్యదర్శి రామడుగు ధర్మచారి, ఎస్.కె. అఫ్జల్, కమటం స్వామి, రాము, వీరభద్రాచారి, కరుణాకర్, సుధాకర్, శంకర్, సామ్యేల్ తదిత రులు పాల్గొన్నారు.