calender_icon.png 23 January, 2026 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక

23-01-2026 12:00:00 AM

గుమ్మడిదల, జనవరి 22: మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురభి కుమార్ గౌడ్ తమ అనుచరులతో కలిసి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మున్సిపల్ ఇంచార్జ్ పట్నం మాణిక్యం, కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో సురభి కుమార్ గౌడ్ కు పార్టీ కండువా కప్పి బిఆర్‌ఎస్ లోకి ఆహ్వానించారు.

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిన బిఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బిఆర్‌ఎస్ లో చేరినట్లు సురభి కుమార్ గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కుమార్ గౌడ్, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్, గోపాల్, మురళి, కార్యకర్తలు పాల్గొన్నారు.