13-09-2025 05:26:36 PM
నకిరేకల్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) అన్నారు. శనివారం పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియెజకవర్గ పరిధిలోని కేతేపల్లి, నకిరేకల్, కట్టంగూర్, నార్కెట్‌పల్లి, చిట్యాల మండలాలకు సంబంధించిన 207 మంది లభ్దిదారులకు ముఖ్యమంత్రి సహయనిధి కింద మంజూరైన 73 లక్షల 65 వేల రూపాయల చెక్కులను లభ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, మునిసిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాధగోని కొండయ్య తదితరులు పాల్గొన్నారు.