calender_icon.png 13 September, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిప్టో నిందితులపై ఉక్కుపాదం మోపాలి..

13-09-2025 07:14:28 PM

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..

కరీంనగర్ (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ పేరిట సామాన్య పేద ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన నిందితులందరిపై పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపాలనీ, మళ్లీ అలాంటి వ్యవహారాలు చేయాలంటేనే వారిలో వణుకు పుట్టేలా కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు(In-charge Velchala Rajender Rao) సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలి పెట్టవద్దనీ, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పేర్కొన్నారు.

ఇప్పటికే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈ కేసు విషయంలో ప్రత్యేక దృష్టి సారించడంతో అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం పడుతున్నదన్నారు. క్రిప్టో కరెన్సీ కేసులో శుక్రవారం అరెస్టయిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ ను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. ఈ విషయంలో పీసీసీ, డిసిసి అధ్యక్షులకు లేఖలు రాశానని పేర్కొన్నారు. క్రిప్టో బాధితులు ఎలాంటి భయాందోళన చెందకుండా నిర్భయంగా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని వెలిచాల రాజేందర్ రావు సూచించారు.