calender_icon.png 22 September, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధి పేదలకు వరం

22-09-2025 05:22:10 PM

దౌల్తాబాద్: మండల కేంద్రంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు పడాల రాములు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు కలిపి రూ.2,98,500 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “ప్రజలకు అవసరమైన సమయంలో అండగ నిలబడటం సీఎం సహాయనిధి ప్రధాన లక్ష్యమని పేద కుటుంబాలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల పరిష్కారంలో ఈ నిధి విశేషంగా ఉపయోగపడుతోందన్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని లబ్ధిదారులు అందుకున్న చెక్కులను సద్వినియోగం చేసుకొని అవసరమైన చోట ఖర్చు చేయాలని సూచించారు.

చెక్కులు స్వీకరించిన లబ్ధిదారులు తమపై చూపుతున్న ప్రభుత్వ సహకారం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దుబ్బాక నియోజకవర్గ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి, ఆత్మ కమిటీ డైరెక్టర్ సూరంపల్లి ప్రవీణ్, జనగామ మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ లలిత కృష్ణ, రాజు, సురేందర్, ఇమ్రాన్, శ్రీనివాస్ గౌడ్, లింగం, కృష్ణ తదితరులున్నారు.