calender_icon.png 22 September, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ కు ఘన సన్మానం

22-09-2025 05:23:13 PM

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని పొన్నారం  గ్రామపంచాయతీకి చెందిన మిడివెల్లి వెంకటేష్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందగా ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది సోమవారం ఘనంగా సన్మానించారు. 2016 నుండి కొమరం భీమ్ అసుఫాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన వెంకటేష్ పదోన్నతి పొంది బెల్లంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న వెంకటేష్ ను టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఇదిలా ఉండగా పోన్నారం  గ్రామానికి చెందిన వెంకటేష్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధుల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందడం గ్రామానికి గర్వకారణమని, రానున్న రోజుల్లో మరిన్ని పదోన్నతులు పొంది గ్రామానికి, డిపార్ట్మెంట్ కు పేరు తీసుకు రావాలని గ్రామస్తులు కోరారు. పదోన్నతి పొందిన వెంకటేష్ ను గ్రామస్తు లు వాల రవీందర్ రావు, సంకే శ్రీనివాస్, మాస్ సంతోష్, పెంచాల మధు, పెంచల రాజు, పెంచాల రాజలింగు, గడ్డం శ్రీనివాస్, సిరిమల్ల శ్రీనివాస్, పెంచాల రంజిత్, దొంఢ సంపత్, ఈద లింగయ్య,లు అభినందించారు.