calender_icon.png 22 September, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోటార్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెంజర్ల సైదులు

22-09-2025 05:20:57 PM

నకిరేకల్,(విజయక్రాంతి): తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కట్టంగూరు మండలం ఇస్మాయిల్ పల్లికి చెందిన పెంజర్ల సైదులు ఎన్నికయ్యారు ఈనెల 20 21 తేదీలలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర నాలుగవ మహాసభలలో ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఆసంఘం నల్లగోండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సైదులు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల మండల వివిధ రంగాల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన  విలేకరులతో మాట్లాడుతూ మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననిఅన్నారు.

మహాలక్ష్మి పథకం ద్వారా జీవన భృతి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ప్రకటించిన 12000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లారీ డ్రైవర్లకు సుదూర ప్రాంతాలకు వెళ్తున్న వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని 50 సంవత్సరాలు నిండిన కార్మికులందరికీ తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ కార్యాలయాలలో అద్య ప్రాతిపదికన తీసుకుంటున్న కారులకు ఎల్లో ప్లేట్ మాత్రమే వాడాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నుండి ఆయనతో పాటు చిట్యాల మండలానికి చెందిన పేర్వాల  రాములు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.