calender_icon.png 22 July, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

22-07-2025 01:13:42 AM

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఆయురారోగ్యం, సు ఖఃసంతోషాలతో, ప్రజలకు ఆయన సేవలందించాని కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు.

ఖర్గే ఆయురారోగ్యాలతో ఉండాలి: టీపీసీసీ చీఫ్  మహేశ్ 

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదినం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్  కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజానేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఖర్గే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఖర్గేను కలిసిన వారిలో ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, హర్కర్ వేణుగోపాల్, పార్టీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ తదితరులున్నారు.