calender_icon.png 22 July, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు పాఠశాలలు, జూనియర్ కాలేజీల బంద్

22-07-2025 01:14:04 AM

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల బంద్

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో బుధవారం విద్యాసంస్థలు బంద్ కానున్నాయి.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్, ఎస్ ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ, ఏఐఎస్‌బీ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐపీఎస్‌యూ విద్యా ర్థి సంఘాలు బంద్‌ను పాటించనున్నాయి.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీ, మధ్యా హ్న భోజన పథకం విస్తరణ, స్కాలర్‌షిప్‌ల విడుదల వంటి పలు డిమాండ్లతో విద్యార్థి సం ఘాల నేతలు ఆందోళన బాట చేపట్టనున్నారు. 

డిమాండ్లు ఇవి..

* ప్రైవేట్ కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి.

* ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులు భర్తీ చేయాలి.

* ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి.

* పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి.

* అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌళిక సదుపాయాలు కల్పించి, నిధులు ఇవ్వాలి.

* పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలి.

* అద్దె భవననాలలో నడుస్తున్న వసతి గృహాలకు స్వంత భవనాలు నిర్మించాలి.

* గురుకులాల్లో అశాస్త్రీయంగా తీసుకు వచ్చిన సమయపాలనను మార్చాలి.

* బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి.

* విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్‌పాసులు ఇవ్వాలి.

* ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి.

* ఎన్‌ఈపీ తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలి.