24-07-2025 05:20:48 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని డాకు తండా, రాధానగర్ తండా, పొర్లగడ్డ తండాలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) మార్నింగ్ వాక్ నిర్వహించి తండా వాసుల సమస్యలను తెలుసుకున్నారు. గిరిజనులు పింఛను రావడం లేదని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని తమ భూ సమస్యలపై ఎమ్మెల్యేతో చెప్పుకున్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పింఛను వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు పింఛన్లు తన భాధ్యత అని అన్నారు. తండాల్లో రోడ్ల సమస్యను తెలుసుకొని త్వరలోనే లింకు రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అంగవైకల్యంతో భాధ పడుతున్న వారికి మండలానికొక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కరంటోతు శ్రీను నాయక్,మాజీ ఎంపిపి బుజ్జి నాయక్,మాజీ జడ్పీటీసీ వీరమళ్ళ భానుమతి వెంకటేష్,మండల నాయకులు కత్తుల లక్ష్మయ్య,బిక్షపతి నాయక్,తదితరులు పాల్గొన్నారు.