calender_icon.png 9 February, 2026 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ మానసిక రోగి

09-02-2026 02:27:40 AM

  1. జనాన్ని కరిచేలా ఉన్నారు.. డాక్టర్‌కు చూపించాలి
  2. ప్రతిపక్షం బాధత్యతో ప్రశ్నిస్తుంటే బూతుపురాణం
  3. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డి మానసిన రోగిలా మారారని, జనాన్ని కరిచేలా ఉన్నారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ నేతలు పట్టి డాక్టర్‌కు చూపాలని సూచించారు. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే మాజీ సీఎం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను తిడుతున్నారని, సమావేశం ఏదైనా కేసీఆర్‌ను తిట్టి శునకానందం పొందుతున్నారని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నె ప్రభాకర్ మాట్లాడారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి బూతు పురాణం మొదలు పెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 700 రోజులైనా సీఎంలో మార్పురాలేదని, ఓ తివ్రవాదిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి తన గురు వు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ర్టం రావణ కాష్టం కావాలని చూస్తున్నారని, కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, హనుమంతరావు లాంటి వారు స్పందించాలని సూచించారు. కేసీఆర్‌ను తిట్టి సీఎం తన కురుచ తనా న్ని, కురూపి తనాన్ని చాటుకున్నారని అన్నా రు. మిర్యాలగూడ సభలో జానారెడ్డిని ఫ్యూడ ల్ నాయకుడని అన్నారని గుర్తు చేశారు. 

అందరినీ తొక్కుకుంటూ వచ్చానని రేవంత్ రెడ్డే స్వయంగా అన్నారని, జానారెడ్డిని, జీవన్‌రెడ్డిని, కోమటిరెడ్డిని తొక్కుకుంటూ వచ్చావా అని ప్రశ్నించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేష్టలతో కాంగ్రెస్ యాబై ఏండ్ల వెనక్కి పోయింరని, కాంగ్రెస్‌ను బొందపెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి హర్వర్డ్ నుంచి మంచి నాయకత్వ లక్షణాలతో వస్తాడనుకుంటే పిచ్చి ముదిరినట్టు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సీఎం అధికారిక సభలు పెట్టి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, అవి ఎన్నికల సభలా, అభివృద్ధి సభలా ఎన్నికల సంఘం తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో బీఆర్‌ఎస్ నేత బొమ్మెర రామమూర్తి పాల్గొన్నారు.