25-10-2025 07:13:15 PM
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో ముస్తాబాద్ మండల నాయకులు మహిళలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం హైదరాబాద్ ఆనంద కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు వనిత ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో శ్రీలత, స్వప్న, సంతోష తదితరులు పాల్గొన్నారు.