calender_icon.png 26 October, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు రాష్ట్రస్థాయి యోగా పోటీలు

25-10-2025 07:17:17 PM

నకిరేకల్,(విజయక్రాంతి): ఈ నెల 26న ఆనందోబ్రహ్మ యోగమండలి ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి యోగ పోటీలు పోస్టర్ ను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు. అనంతరం ఆనందోబ్రహ్మ యోగ మండలి ప్రధాన గురూజీ మిరియాల చల్మరాజు  మాట్లాడుతూ... సంస్థ సీనియర్ సభ్యులు బ్రహ్మదేవర రామ్మూర్తి, పోతుల రాములు జ్ఞాపకార్థం ఆనందోబ్రహ్మ రాష్ట్ర స్థాయి యోగ పోటీలను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యోగ అభిమానులు, సాధకులు ఈ  పోటీలలో పాల్గొనాలని, స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.