17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

దత్తాత్రేయను చూసి ఎంతో నేర్చుకోవాలి: సీఎం రేవంత్

08-06-2025 02:55 PM

హైదరాబాద్: 'ప్రజల కథే నా ఆత్మకథ' పేరుతో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రాఫీ పుస్తకావిష్కరణ(Autobiography Book) ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలతో ఉన్న ఆయన అనుబంధాన్ని ఆత్మకథ పుస్తకంలో దత్తాత్రేయ పంచుకున్నారని పేర్కొన్నారు. గౌలిగూడ గల్లీ నుంచి హరియాణా గవర్నర్ గా ఆయన ఎదిగారని సీఎం గుర్తు చేశారు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను చూశారని, ఏరోజూ కూడా దత్తాత్రేయ ప్రజలతో ఉన్న సంబంధాలను కోల్పోలేదన్నారు.

దత్తాత్రేయకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో తనకు సన్నిహిత సంబధాలున్నాయని రేవంత్ చెప్పారు. ఒక్కసారి కార్పొరేటర్ అయితేనే జీవనశైలి మారుతోందని, కానీ ఎంత ఎత్తుకు ఎదిగిన తన శైలి మారాలేదని, దత్తాత్రేయను చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. జాతీయస్థాయిలో వాజ్ పేయీకి ఉన్న గౌరవం.. రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉందన్నారు. ఎన్నికల్లో ఓడినా ఎప్పుడు వాజ్ పేయీ గౌరవం తగ్గలేదని, దత్తాత్రేయ ఆటో బయోగ్రాఫీ పుస్తకావిష్కరణ వేదిక గవర్నర్ల పరేడ్ మాదిరిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పీ. జనార్థన్ రెడ్డి, దత్తాత్రేయ పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.