15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎమ్మెల్యే మాగంటి భౌతికకాయానికి కేసీఆర్ కన్నీటి నివాళి

08-06-2025 01:38 PM

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఆదివారం ఉదయం మరణించిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. మాదాపూర్‌లోని డాక్టర్స్ కాలనీలో గోపీనాథ్ నివాసాన్ని వెళ్లిన కేసీఆర్, గోపీనాథ్ మృతదేహాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తరువాత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూలి తెలియజేశారు. కేసీఆర్ వెంట బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఇతర పార్టీ నాయకులు ఉన్నారు.