calender_icon.png 20 November, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం : కిషన్ రెడ్డి

24-07-2024 06:46:16 PM

హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల వ్యవహార శైలిలోనే ఇప్పుడు మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. రూ. లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీశారని, రెండు పార్టీల నేతలు పోటీపడి మోదీని విమర్శిస్తున్నాయన్నారు. అవినీతి, అసమర్థతతో పాలన చేతకాక కేంద్రాన్ని విమర్శిస్తున్నారని, కేంద్ర నిధులను, గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తొందని కేంద్ర మంత్రి ఆరోపించారు.

ఓట్ల కోసమే తప్ప ప్రజలకు నిధులు ఖర్చు చేయట్లేదని, సంక్షేమ పథకాల కోసం కేంద్రం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశామన్నారు. రామగుండంలో విద్యుదదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసిందని, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద ప్రభుత్వం గిరిజన వర్సిటీ కోసం నిధులు మంజూరు చేసిందని, జీఎస్టీ పరిహారం కింద రూ.7 వేల కోట్లు అందజేసిందని తెలిపారు.