20-09-2025 08:27:39 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.
ముగిసిన పెద్దపెల్లి జిల్లా ఎస్జిఎఫ్ క్రీడా పోటీలు.
సుల్తానాబాద్ (విజయక్రాంతి): క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chinthakunta Vijaya Ramana Rao) అన్నారు. శనివారం రాత్రి సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పెద్దపల్లి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్స్ ముగిసాయి. ముగింపు సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ సుల్తానాబాద్ క్రీడలకు పుట్టినిల్లుని, క్రీడాకారుల సంక్షేమానికి తన వంతు కృషి ఎప్పుడు ఉంటుందన్నారు. ఈ జిల్లా స్థాయి క్రీడా పోటీలు రెండు రోజులపాటు నిర్వహించి దాదాపు 700 మంది క్రీడాకారులకు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించిన సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ అందించిన సేవలు అభినందనీయమని రవీందర్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మాధవి, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, క్రీడల అభివృద్ధి అధికారి సురేష్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ లక్ష్మణ్, అమీరీ శెట్టి తిరుపతి, రాజలింగం, పన్నాల రాములు, గెల్లు మధుకర్, కుమార్ కిషోర్, పలువురు నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.