calender_icon.png 26 July, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ

24-07-2025 11:08:03 AM

  1. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక భేటీ..
  2. ఖర్గే నివాసానికి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి..
  3. తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై బ్రీఫింగ్
  4. ఖర్గే నివాసానికి చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్ గాంధీతో గురువారం భేటీ అయ్యారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయ్యారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే తీరు, శాసనసభ ఆమోదించిన బిల్లులపై సీఎం వివరిస్తున్నారు.