26-07-2025 05:48:38 PM
సీఐ సంతోష్ కుమార్..
సదాశివనగర్ (విజయక్రాంతి): ప్రస్తుతం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, కల్వర్టులు, కాజు వేసే ప్రాంతాలు అంతకంతకు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్(CI Santosh Kumar), ఎస్‌ఐ పుష్పరాజ్(SI Pushparaj)తో కలిసి మండల పరిధిలోని వాగులు, ప్రమాదకరమైన ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిక్ పోలు, పాత గృహాల దగ్గర ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పాత నిర్మాణాలు, పక్కటెముక గృహాలు, లేదా పొడవైన గోడలున్న ప్రదేశాల్లో నివసిస్తున్నవారు తక్షణమే పోలీసులకు లేదా గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వాలని, అవసరమైతే తాత్కాలిక నివాసానికి తరలించుకోవాలని సూచించారు.
ఎవరూ పొంగిపొర్లుతున్న వాగులు, కల్వర్తుల దగ్గర సెల్ఫీలు తీయడానికి లేదా చేపలు పట్టుకోవడానికి వెళ్లకూడదన్నారు. ఇటువంటి ప్రదేశాలకు వెళ్లడం వల్ల ప్రమాదవశాత్తు ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మనవి చేశారు.సదాశివనగర్ పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ మీ సేవలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏ అత్యవసర పరిస్థితుల్లోనైనా వెంటనే 100 నెంబర్ కు కాల్ చేయలని కోరారు.