calender_icon.png 27 July, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

26-07-2025 05:45:46 PM

వైద్య అధికారి ఆస్మా అఫ్రీన్..

సదాశివనగర్ (విజయక్రాంతి): వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల వైద్య అధికారి అస్మా అఫ్రిన్(District Medical Officer Asma Afrin) అన్నారు. ఈ మేరకు మండలంలోని మూడేగం గ్రామంలో శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. స్క్రీనింగ్, బీపీ, షుగర్ పరీక్షలు చేయడం జరిగింది. ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. పరిశుభ్రమైన నీటిని తాగాలని, నీటిని వేడి చేసుకుని తాగాలని, జ్వరము ఏమైనా వస్తే మండల కేంద్రంలోని హాస్పిటల్ కి రావాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో MLHP మౌనిక, ANM లు లలితా, సంగీత, ఆశా వర్కర్లు సరస్వతి, సుజాత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.