calender_icon.png 27 July, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ దుర్గా రెడ్డి

26-07-2025 06:06:46 PM

కంగ్టి: మండల వ్యాపంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమతంగా ఉండాలని స్థానిక ఎస్ఐ దుర్గారెడ్డి(SI Durga Reddy) అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, మత్తడిలు నిండి పొంగిపొర్లుతున్న సందర్బంగా యువకులు సెల్ఫీల పేరుతో అటు వైపు వెళ్ళకూడదని అన్నారు. వరద ప్రవాహంలో రోడ్లు దాటాకూడదని అన్నారు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని పిల్లలకు బయటికి పంపకుండా ఇంటివద్దే ఉంచుకోవాలని, అవసరమైతే పోలీస్ స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని అన్నారు. సహాయానికి మేము ఎల్లపుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.