26-07-2025 05:58:02 PM
ఘట్ కేసర్: ఘట్ కేసర్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy)పై ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఫిర్యాదును పోలీస్ స్టేషన్ లో సీఐ పి. పరుశురాంకు అందజేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవాన్ని కించపరిచేలా ఉండటంతో, తగిన చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులో కోరారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్తీక్, రఫీయుదిన్, కృష్ణ, సాల్మన్ రాజ్, సాయి కుమార్, పాల్గొన్నారు.