26-07-2025 05:55:42 PM
ఘనంగా సన్మానిచ్చిన ఐ ఎన్ టీ యు సి నాయకులు..
కొత్తగూడెం (విజయక్రాంతి): పీవీకే 5 గనిలో కొత్తగా విధులలో చేరిన ఏజెంట్ రామ్ బరోస్ మహాతోని, మేనేజర్ శ్యామ్ ప్రసాద్ కార్యాలయంలో ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్(INTUC Vice President MD Razak) ఆధ్వర్యంలో శనివారం ఏజెంట్ ని కలసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మైన్ కోసం ప్రస్థావిస్తూ, 72 సంవత్సరాల నుండి నడుస్తున్న అతి పురాతనమైన మైన్ లో, యువ కార్మికులతో పాటు అనుభవం గల సీనియర్ కార్మికులు సేఫ్టీతో పాటు ప్రొడక్షన్, ప్రొడక్టివిటీనీ పెంచడంలో దోహదపడతారని ఏజెంట్ కి వివరించారు. మానేజ్మెంట్ సైడ్ నుండి అండర్ గ్రౌండ్ లో వున్న పని ప్రదేశాలలో సేఫ్టీ, వెంటిలేషన్, మంచినీటి సౌకర్యాలతో పాటు, పనికి అవసరమైన పని ముట్లను కార్మికులకు అందుబాటులో ఉంచాలని కోరారు.
గతంలో పనిచేసిన ఏజెంట్లు గని జీవిత కాలాన్ని పెంచడంలో కృషి చేసారని, అభివృద్ధి పథంలో ముందుకుసాగలని నూతన ఏజెంట్ ను కోరారు. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ చిలక రాజయ్య, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బుటిక రాజేశ్వర్ రావు, సెంట్రల్ కౌన్సిల్ మెంబెర్స్ సకినాల సమ్మయ్య, మల్లారపు కొమరయ్య,వర్కమెన్ ఇన్స్పెక్టర్ జి నవీన్,సేఫ్టీ కమిటీ మెంబెర్ సాయిప్రసాద్ ఓఎం, మైన్స్ కమిటీ మెంబెర్ ఘన్ శ్యామ్,అసిస్టెంట్ పిట్ సెక్రటరీ వల్లలా సాంబమూర్తి, ఐ ఎన్ టీ యు సి నాయకులు షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.