calender_icon.png 26 July, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ రాయబార కార్యాలయం గుట్టురట్టు

24-07-2025 01:06:43 AM

  1. వెస్ట్ ఆర్కిటికా పేరుతో ఎంబసీ నడుపుతున్న హర్షవర్దన్ జైన్
  2. ఘజియాబాద్‌లో రెండంతస్తుల భవనంలో కార్యాలయం
  3. ఖరీదైన కార్లపై ఎంబసీ స్టిక్కర్లు.. ప్రముఖ నేతలతో మార్ఫింగ్ ఫోటోలు
  4. మనీలాండరింగ్ ఆరోపణలతో పోలీసులు అదుపులో నిందితుడు

ఘజియాబాద్, జూలై 23: భూమిపై లేని ఒక దేశానికి ఎంబసీని ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్షవర్దన్ జైన్ అనే వ్యక్తి ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు సమీపంలోని ఘజియాబాద్‌లో వెస్ట్ ఆర్కిటికా పేరుతో దౌత్య కార్యాలయాన్ని నడుపుతున్నాడు. ఎవరికీ అనుమానం రాకుం డా ఖరీదైన కార్లపై ఎంబసీ స్టిక్కర్లు, దౌత్య పాస్‌పోర్టులు, విదేశీ కరెన్సీ, దేశంలోని ప్రము ఖ నేతలతో దిగిన ఫోటోలను వాడుకున్నాడు.

దీని పేరుతో జైన్ విదేశాల్లో పని ఇప్పిస్తానని యువతను నమ్మిస్తూ ఒక జాబ్‌రాకెట్ నిర్వహిస్తూ వచ్చాడు. యువత అతడిని నమ్మేందు కు రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫోటోలను వాడుకున్నాడు. తాజాగా ఎంబసీ ఫోటోలను సామాజిక మా ధ్యమంలో షేర్ చేయడంతో పోలీసులకు అ నుమానమొచ్చింది. ఈ నేపథ్యంలో హర్షవర్దన్ కార్యాకలాపాలపై పోలీసులు రెక్కీ నిర్వ హించగా నకిలీ రాయబార కార్యాలయం గు ట్టు రట్టయింది.

నిందితుడి వద్ద వెస్ట్ ఆర్కిటికాతో పాటు 12 మైక్రోనేషన్ల దౌత్య పాస్‌పో ర్టులు, విదేశాంగ శాఖ స్టాంపులున్న దస్త్రాలు, 34 దేశాల స్టాంపులు, రూ. 44 లక్షల నగదు, దౌత్య నంబర్‌ప్లేట్లు, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వెస్ట్ ఆర్కిటికా అనేది అంటార్కిటికాలోని ఒక ప్రాంతం. దీనికి ఎలాంటి గుర్తింపు లేదు. గతంలో ఒక యూ ఎస్ నౌకాదళ అధికారి దీనిని దేశంగా ప్రకటించుకున్నాడు.

2017 నుంచి వెస్ట్ ఆర్కిటికా పేరిట దౌత్య కార్యాలయం నడుపుతున్నట్టు వెల్లడించాడు. ఇదే వెస్ట్ ఆర్కిటికా ఎంబసీ పేరిట ఏర్పాటు చేసిన ఇన్‌స్టాగ్రాంలో హర్షవర్దన్ తనను తాను ఆ దేశానికి చెందిన సం పన్నుడిగా పేర్కొన డం గమనార్హం. సా ధారణంగా ఆర్కిటిక్ ఉత్తర ధ్రువంలో ఉం టే అంటార్కిటికిలో ఆ పేరు ఎలా వచ్చిందన్నది అంతుచిక్కని ప్రశ్నలా మారింది.