calender_icon.png 27 July, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం: హరీశ్ రావు

26-07-2025 05:37:40 PM

హైదరాబాద్: హైదరాబాద్ లోని మల్లాపూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సదస్సుకు బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం హరీశ్ రావు మాట్లాడుతూ... నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం.. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతాం అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కోన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ తన చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడు. రేవంత్, ఢిల్లీ ఒప్పుకున్నా, తెలంగాణ సమాజం బనకచర్లకు ఒప్పుకోదన్నారు. ఉస్మానియా, కాకతీయ మళ్లీ ఉద్యమ వేదికలై తెలంగాణ హక్కులు కాపాడతాయి.

జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం, రైలు రోకో చేస్తాం.. ఢిల్లీ మెడలు వంచుతాం తప్పా ఒక్క నీటి చుక్క కూడా వదలమని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడని విమర్శించారు. తెలంగాణ ద్రోహుల జాబితా రాస్తే, మొదటి పేరు చంద్రబాబు నాయుడుది ఉంటే, రెండో పేరు రేవంత్ రెడ్డిది ఉంటుందన్నారు.

చంద్రబాబు నాయుడు నువ్వు తెలంగాణ నీళ్లు దోచుకోవడానికి అధికారంలో ఉన్న నీ శిష్యుడు సహకరించినానీ దోస్తు బిజెపి సహకరించినామేము అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. తెలంగాణ హక్కుగా ఉన్న నీళ్ల నుండి ఒక్క చుక్క కూడా పోనివ్వమని హరీశ్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని వివరించారు.